Followers

బి.జె.వై.ఎం,ఆధ్వర్యంలో అమరవీరుల దినోత్సవం..

 బి.జె.వై.ఎం,ఆధ్వర్యంలో అమరవీరుల దినోత్సవం..

ముఖ్య అతిథులుగా  పి. విష్ణుకుమార్ రాజు మరియు మెడపాటీ రవీంద్ర 

విశాఖ తూర్పు, పెన్ పవర్

భారతీయ జనతా యువమోర్చ ఆధ్వర్యంలో అమరవీరుల దినోత్సవం సందర్భంగా బీచ్ రోడ్ లో ఉన్న భగత్ సింగ్ విగ్రహం వద్ద మంగళవారం ఉదయం నివాళులు అర్పించారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షులు కాళ్ళ అశోక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. విష్ణుకుమార్ రాజు మరియు బీజేపీ విశాఖపట్నం పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు రవీంద్ర మేడపాటి విచ్చేసారు.ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమ పోరాటంలో ఉరితీయబడిన భగత్ సింగ్, సుఖ్ దేవ్ థాపర్, రాజ్ గురు లను గుర్తు చేసుకున్నారు. భగత్ సింగ్ స్వాతంత్రోద్యమ కాలంలో యువతకి స్ఫూర్తినిచ్చి వారిలో చైతన్యాన్ని కలిగించిన ఒక అమరజీవి అని స్వాతంత్రోద్యమంలో చివరి దాకా పాల్గొనే అవకాశం లేకపోయినా భగత్ సింగ్ పోరాటం మాత్రం చాలా కీలకమైనదని తెలిపారు.సుఖ్ దేవ్ థాపర్, భగత్ సింగ్, రాజ్‌గురు ల సహచరునిగా ప్రసిధ్ధి. 1928 లాలా లజపతి రాయ్ మరణానికి కారణమైన బ్రిటిష్ ప్రభుత్వం పై పగతీర్చుకోవడానికి, ఫిరోజ్ పూర్ లో బ్రిటిష్ పోలీసు అధికారి "జె.పి. సాండర్స్" ను హతమార్చినందులకు గాను మార్చి 23, 1931 న ఉరితీయబడ్డాడని అన్నారు.ఈ ముగ్గురు (భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్) ని కూడా 1931 మార్చి 23న లాహోరు సెంట్రల్ జైలులో సాయంకాలం 7.33 సమయానికి ఉరి తీశారని, అప్పటి నిబంధనల ప్రకారం ఆ సమయంలో ఉరి శిక్ష అమలు  కాకపోయినా వారి మృత దేహాలను రహస్యంగా, జైలు వెనుక గోడలు పగులగొట్టి తీసికొని వెళ్ళి సట్లెజ్ నది తీరాన హుస్సేన్‌వాలా అనే ఊరిలో దహనం చేశారని అన్నారు. భగత్ సింగ్ స్మారకచిహ్నం నేడు భారత స్వాతంత్య్ర సమరయోధులను గుర్తుకు తెస్తుందని తెలుపుతూ అయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఏస్.ఆర్. కె. కె.ఏస్,జగపతి రాజా బహదూర్,బీజేవైఎం నాయకులు దిలీప్ ఈశ్వర్ రాజ్, కిరణ్ బావిశెట్టి,ప్రసాద్ రుద్రరాజు, ప్రసాద్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...