Followers

స్మార్ట్ ఎగ్జిబిషన్ అండ్ ఎన్విరాన్మెంట్ ఎగ్జిబిషన్ పోస్టర్ ఓపెన్ చేసిన విసి ప్రసాద్ రెడ్డి

 స్మార్ట్ ఎగ్జిబిషన్ అండ్ ఎన్విరాన్మెంట్ ఎగ్జిబిషన్ పోస్టర్ ఓపెన్ చేసిన విసి ప్రసాద్ రెడ్డి

విశాఖ ఉత్తరం, పెన్ పవర్

స్మార్ట్ ఎగ్జిబిషన్ అండ్ ఎన్విరాన్మెంట్ ఎగ్జిబిషన్ కు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్ వేదికవుతోంది. ఏప్రిల్ 8వ తేదీ నుండి 18వ తేదీ వరకు జరగనున్న ఈ ప్రదర్శనకు సంబంధించిన ఇంగ్లీష్ పోస్టర్ ను ఏ యు సెనేట్ హాల్ లో జరిగిన కార్యక్రమం లో ఆంధ్ర యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ప్రసాద్ రెడ్డి విడుదల చేయగా, తెలుగు పోస్టర్ ను ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు విడుదల చేశారు. ఈ ప్రదర్శనలో సీడ్ ఎక్స్పోకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు తోపాటు వినియోగదారులకు అవసరమైన వివిధ రకాల స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్టు నిర్వాహకులు అడ్ల సుభాష్ వివరించారు.ఆరుష్ గ్రూప్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఏ యు ఉపకులపతి ప్రసాద్ రెడ్డి కోరారు. అదేవిధంగా సదస్సులో ఏర్పాటు చేస్తున్న ఈ హెల్త్, ఈ కామర్స్, ఈ ఏడుకేషన్ ప్రదర్శనను తిలకించి అవగాహన పెంచుకోవాలని సూచించారు.ప్రస్తుత విప్పతకర పరిస్థితులను ఎదుర్కొంటున్న వ్యాపారవేత్తలకు, వ్యవసాయదారులకు , ఉద్యోగం లేజ్ ఎటువంటి విధానానికి వెళ్లాలో తెలియని యువత కు నాణ్యమైన ఉత్పత్తులు అందించే సంస్థలకు అందంగా ఈ ఎగ్జిబిషన్ ఉంటుందని తెలిపారు.ఈ  కార్యక్రమంలో రెక్టార్ కె.సమంత తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...