విధులకు గైర్హాజరయిన ఉపాద్యాయుడు సస్పెండ్
చింతపల్లి,పెన్ పవర్
మండలంలోని చౌడుపల్లి పంచాయతీ బౌర్తి ప్రభుత్వ గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు గుల్లెల సత్యరాజును ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ సలిజామల సస్పెండ్ చేశారు. సోమవారం మండలంలో పర్యటించిన ఆయన బౌర్తి పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మనబడి నాడు నేడు పనులను తనిఖీ చేశారు. మనబడి నాడు పనులు అసంపూర్తిగా నిలిచిపోవడాన్ని గమనించారు. అలాగే ఉపాధ్యాయుడు రూ.5వేలు వేతనం ఇచ్చి వ్యక్తిగత వలంటీర్ ను నియమించి ఆయన విధులకు గైర్హాజరవుతున్నట్లు అదేవిధంగా పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న 5వ తరగతి విద్యార్థులు కనీసం అ, ఆ,లు కూడా చెప్పలేకపోతున్నారని విద్యా ప్రమాణాలపై పిఓ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుడు పాఠశాలకు వస్తున్నదీ లేనిది గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్నం భోజనం పై ఆరా తీశారు. పిల్లలకు యూనిఫామ్ కుట్టించాలని తల్లిదండ్రులకు సూచించారు.
No comments:
Post a Comment