వ్యసన నివారణ అవగాహన కార్యక్రమ ప్రచార రథం ఆవిష్కరణ
పెన్ పవర్, కందుకూరుస్థానిక రెవెన్యూ కాలనీలో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వ్యసన నివారణ మరియు పునరావాస కేంద్రం నకు చెందిన ప్రచార రధం ను కందుకూరు సబ్ కలెక్టర్ భార్గవ్ తేజ శనివారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ భార్గవ తేజ మాట్లాడుతూ మద్యం మత్తుకు బానిస కాకుండా దురలవాట్లకు దూరంగా ఉంటూ తమ కుటుంబాలతో హాయిగా గడపాలని అన్నారు. చెడు వ్యసనాల వల్ల ఆర్థిక భారంతో పాటు సమాజంలో విలువ ఉండదని అన్నారు. కావున ప్రతి ఒక్కరు సత్ప్రవర్తనతో మెలగాలని ప్రతి ఒక్కరిని గౌరవించాలని కోరారు. సమాజం ఆరోగ్యంగా అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని రాష్ట్రాలు ఆరోగ్యంగా అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందని ఆరోగ్య భారతదేశం గా ఉండాలని కోరారు.
ఈ ప్రచార రధం ద్వారా కందుకూరు రెవిన్యూ డివిజన్ పరిధిలోని అన్ని గ్రామాలలో వ్యసన నివారణ కొరకు అవగాహన కల్పించి వైద్య సహాయం అంద చేస్తామని.ప్రాజెక్టు డైరెక్టర్ గేరా చిరంజీవమ్మ తెలిపారు. ఇప్పటికే సమాజంలో అనేక మందిని మా పునరావాస కేంద్రంలో వ్యసన అలవాట్లపై అవగాహన కల్పించి అనేకమందిని మార్చామని తెలిపారు. నియోజకవర్గంలో వ్యసన నివారణ అవగాహన కార్యక్రమాలు ఇప్పటికే అనేక చోట్ల నిర్వహించామని తెలిపారు. పునరావాస కేంద్రంలో ఉచిత వైద్యం తో పాటు ఉచిత భోజన వసతి కూడా ఉందని సబ్ కలెక్టర్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో నరసింహ,పీర్ ఎడ్యుకేటర్ ప్రభుదాస్, ప్రశాంతి, రాహుల్, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment