Followers

కోర్టు ధిక్కరణ కేసులో కలెక్టర్‌కు మూడు నెలల జైలు శిక్ష

 కోర్టు ధిక్కరణ కేసులో కలెక్టర్‌కు మూడు నెలల జైలు శిక్ష 

రాజన్న సిరిసిల్ల జిల్లా,పెన్ పవర్

 కోర్టు ధిక్కరణ కేసులో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ డి. కృష్ణ భాస్కర్‌తో అప్పటి జాయింట్ కలెక్టర్ యాస్మిన్ భాష, భూ సేకరణ అధికారి శ్రీనివాసులకు హైకోర్టు డివిజన్ బెంచ్ మూడు నెలల సాధారణ జైలు శిక్షతో పాటు 2 వేల రూపాయలు జరిమానాగా విధించింది. హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా గోదావరి నీటిని అధికారులు ప్రాజెక్టులోకి తరలించారని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరికి చెందిన 11 మంది హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్‌ను విచారించిన కోర్టు.. పిటిషనర్లకు ఒక్కొక్కరికి 10 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు ఆదేశాలు జారీ చేశారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...