తై బజార్ వేలం పాట నిర్వహణ
మందమర్రి, పెన్ పవర్మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని తై బజార్, వారాంతపు సంతల నిర్వహణకు ఏప్రిల్ 1,2021 నుండి మార్చి 31,2022 కాలపరిమితితో బుధవారం మున్సిపల్ కార్యాలయంలో వేలం పాట నిర్వహించినట్టు మందమర్రి మున్సిపల్ కమిషనర్ గాదె రాజు తెలిపారు. నిర్వహించిన వేలం పాటలో వైద్య హరి ప్రసాద్ 4 లక్షల 75 వేల రూపాయలు, బండారి రాజ్ కుమార్ 4 లక్షల 70 వేల 500 రూపాయలు, రాకం సంతోష్ 3 లక్షల 81వేల 5 వందల రూపాయలతో వేలం పాటలో పాల్గొనగా, అధిక మొత్తంలో వేలం పాట పాడిన వైద్య హరి ప్రసాద్ వేలం పాట దక్కించుకున్నారని ఆయన తెలిపారు. కేకే 2 వారాంతపు సంత వేలం పాట ఒక్కరు దరఖాస్తు చేసుకున్నారని, పాల చెట్టు సంతకు ఎవరు కూడా దరఖాస్తు చేసుకోలేదని, వీటికి మార్చి 30న తిరిగి వేలంపాట నిర్వహణ జరుగుతుందని ఆయన తెలిపారు.
No comments:
Post a Comment