Followers

సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయండి

సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయండి

పెన్ పవర్,ఆలమూరు

 నూతనంగా ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యుల ఏప్రిల్ 3వ తేదీన జరిగే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని ఆలమూరు ఎంపీడీవో జేఏ ఝాన్సీ మండలంలో గల అన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. మండల కేంద్రమైన ఆలమూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మంగళవారం గ్రామ పంచాయతీ కార్యదర్శులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జరిగిన  కార్యక్రమంలో ఎంపీడీవో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కమీషనర్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి వారి ఆదేశాల మేరకు నూతనంగా ఎన్నికైన సర్పంచ్ వార్డు సభ్యుల ప్రమాణస్వీకారం ఏప్రియల్   3వ తేదీన నిర్వహించిన అనంతరం మొదటి సమావేశం నిర్వహించాలని తెలిపారు. నూతన పంచాయతీ పాలకవర్గం బాధ్యతలు చేపట్టనుండటంతో అన్ని కార్యాలయాలు శుభ్రపరిచి సర్పంచ్ గదికి అవసరమైన ఫర్నీచర్ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే పంచాయితీ, సచివాలయ సిబ్బంది అందరూ హాజరై పాలకవర్గానికి స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేయాలన్నారు. ముందుగా 10.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి సర్పంచ్ వార్డు సభ్యులందరూ కార్యాలయానికి రావాలని, 10.45 గంటలకు కార్యాలయంలో గల మహాత్మాగాంధీ, బీఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూల మాలలతో అలంకరించి అనంతరం 11 గంటలకు ప్రమాణ స్వీకారం నిర్వహించాలన్నారు.  అనంతరం 12 గంటలకు ప్రభుత్వ పథకాలైన నవరత్నాలు, పారిశుధ్యం, మొక్కల పెంపకం, మంచినీటి సరఫరా, ఎల్ఈడీ (వీధిదీపాల) నిర్వహణ, జలశక్తి అభియాన్ (నీటి సంరక్షణ) లపై సంకల్ప  స్వీకారం చేయించాలన్నారు. అనంతరం మొదటి సమావేశంలో ఏప్రియల్ నెలలో నిర్వహించవలసిన కార్యక్రమాలపై చర్చించి, మధ్యాహ్నం 3 గంటలకు నీటిసరఫరా, పారిశుధ్యం, అంగన్వాడీ కేంద్రాలు, హెల్త్ సబ్ సెంటర్లను పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమాలన్నీ ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్వహించవలసిన బాధ్యత కార్యదర్శులపై ఉందని తగు జాగ్రత్తలతో ఉండాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఈవోపిఆర్ డి  రాజ్ కుమార్, మండల ప్రజాపరిషత్తు పరిపాలనా అధికారి టీవీ సురేందర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు  ఆర్ ఎన్ వీ సత్యనారాయణ, యూ రేణుక, కె మోక్షాఅంజలి, రాజు పలువురు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...