Followers

ఉలవపాడు మండల కేంద్రంలో భారత్ బంద్ విజయవంతం

 ఉలవపాడు మండల కేంద్రంలో భారత్ బంద్ విజయవంతం

పెన్ పవర్,ఉలవపాడు

ఉలవపాడు మండల కేంద్రంలో సిపిఎం, తెలుగుదేశం,సిఐటియు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మోడీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఈరోజు జరిగిన భారత్ బంద్ విజయవంతమైంది.బంద్  సందర్భంగా ప్రభుత్వ ప్రైవేటు ఆఫీసులు,విద్యాసంస్థలు,  బ్యాంకులు, గ్రామ సచివాలయాలు మూతపడ్డాయి. ఈ సందర్భంగా రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, రామాయపట్నంలో మేజర్ పోర్టు నిర్మించాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరించం రాదని, ప్రభుత్వ రంగాన్ని కాపాడుకుందామని, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని నినాదాలు చేశారు. మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం గుడ్లూరు ప్రాంతీయ కమిటీ కార్యదర్శి జీవీబీ  కుమార్ మాట్లాడారు.  కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పజెప్పే రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చిందని, వీటికి వ్యతిరేకంగా గత 4 నెలలుగా ఢిల్లీలో రైతాంగం పోరాటం చేస్తుంటే,  మోడీ ప్రభుత్వం సమస్యను పరిష్కరించకుండా నిరంకుశంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. లాభాలు వచ్చే ప్రభుత్వరంగ సమస్యలన్నింటినీ ప్రైవేటీకరణ చేస్తాం, మూసివేస్తామని మోడీ చెప్తున్నానంటే దేశం పట్ల ప్రజల పట్ల, ప్రభుత్వ రంగం పట్ల ఏమాత్రం గౌరవం లేదన్నారు. లాభాలు గడించే విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడం తగదన్నారు. రామాయపట్నంలో మేజర్ పోర్టు నిర్మించడం ద్వారానే ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుందని పేర్కొన్నారు. ఈ భారత్ బంధు ప్రభుత్వానికి గుణపాఠం కావాలన్నారు. ఇప్పటికైనా ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని కోరారు. ఈ బంద్ కార్యక్రమంలో సిపిఎం ఉలవపాడమండల నాయకులు SK.గౌస్ బాష,Sd. రసూల్ బాషా,  ఏలూరు నాగార్జున,తెలుగుదేశం పార్టీ నాయకులు SK.బాజీ, రాచగ ర్ల శివ,బడితల శివ, తొట్టెంపూడి మాల్యాద్రి, మాజీ పంచాయతీ వై.ఎస్ సర్పంచ్ మాల్యాద్రి, సిఐటియు మండల కోశాధికారి Ch.ఇందిరావతి,  ఉలవపాడు మండల ఆటో వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ)అధ్యక్ష కార్యదర్శులు పీ మస్తాన్ రావు, జే.సురేష్ బాబు, పి టి పి స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) అధ్యక్షులు సవరం శ్రీనివాసులు, కోశాధికారి గంజి శ్రీను, ఆఫీస్ బేరర్లు  సుబ్బరామయ్య,పిగిలి శ్రీను,కే మహేష్,వెంకటసుబ్బయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు చేవూరి. లోకేష్, కె ప్రహ్లాద తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...