రహదారి విస్తరణ కోసం భూములు కోల్పోతున్నవారికి పరిహారాన్ని చెల్లించాలి
కరీంనగర్,పెన్ పవర్
జగిత్యాల నుంచి కోదాడ జాతీయ రహదారి ఎంఎచ్ 563 నిర్మాణం కోసం భూములు కోల్పోతున్న త్యాగదనులకు కచ్చితమైన పరిహారాన్ని చెల్లించాలని, రహదారి నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టాలని బీసీ విద్యార్థి సంఘం నాయకులుమంగళవారం రోజునా కరీంనగర్ రెవెన్యూ డివిజనల్ అధికారి కి వినతి పత్రం సమర్పించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుంతలతో ప్రయణయోగ్యంగా లేకుండా ఉన్న జాతీయ రహదారి పునః నిర్మాణం కోసం ఎన్నో ప్రజా ఉద్యమాల ద్వారా రహదారి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేయడం పట్ల ఎంతగానో సంతోషిస్తున్నామనీ, అట్టి రహదారి విస్తరణ నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టాలని, అట్టి రహదారి విస్తరణలో భూములు కోల్పోతున్న త్యాగదనులకు కచ్చితమైన పరిహారాన్ని చెల్లించాలని అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి లేంకల్ అనిల్, కరీంనగర్ నియోజకవర్గ ఇంచార్జి బోయినపల్లి సాయి చంద్, పట్టణ కన్వీనర్ బీరుపుర్ వివేక్, జిల్లా ఉపాధ్యక్షులు దుబాసి ప్రణీత్, పట్టణ ఉపాధ్యక్షులు శివ కుమార్, అజయ్, పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రవణ్, నాయకులు చుక్క సాయి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment