ఎనుగంటి రాజు నేతకు బీజేపీ యువ మోర్చా రాష్ట్ర కమిటీలో చోటు
తార్నాక , పెన్ పవర్
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడికి తెలంగాణ రాష్ట్ర బిజెపి యువమోర్చా లో రాష్ట్ర మీడియా కన్వీనర్ గా స్థానం దక్కడం పట్ల విద్యార్థి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేసి విద్యార్థి నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిరుద్యోగుల కోసం విద్యార్థుల కోసం అనేక ఉద్యమాలు చేసి నేడు బీజేపీ రాష్ట్ర శాఖ లో చోటు దక్కడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు రాజు నేత మాట్లాడుతూ రాబోయే రోజుల్లో సామాజిక తెలంగాణ రాష్ట్రం కోసం విద్యార్థుల కోసం నిరుద్యోగులు సమస్యల కోసం పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో మీడియా కన్వీనర్ గా బాధ్యతలు ఇచ్చినందుకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారికి యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ గారికి మిగతా రాష్ట్ర నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
No comments:
Post a Comment