Followers

సంక్షేమ పధకాలే గెలిపిస్తాయి

 సంక్షేమ పధకాలే గెలిపిస్తాయి



 25 వ వార్డులో సన్యాసిపాత్రుడు

నర్సీపట్నం, పెన్ పవర్ 

స్థానిక సంస్థల ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను వైయస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని వైసిపి సీనియర్ నాయకులు చింతకాయల సన్యాసిపాత్రుడు ధీమా వ్యక్తం చేశారు.  నర్సీపట్నం మున్సిపాలిటీ 25 వ వార్డు లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని దేవత అరుణ కు మద్దతుగా ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. అబీద్  సెంటర్ రామాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ఆయన ప్రచార రధాన్ని ప్రారంభించారు.  అనంతరం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అబీద్  సెంటర్,  అయ్యరకవీధి, మేదర వీధి, తోటవారి వీధి లో సన్యాసి పాత్రుడు ప్రచారం నిర్వహించారు. కరపత్రాలు పంచుతూ వైసీపీ అభ్యర్థిని  దేవత అరుణను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా సన్యాసి పాత్రుడు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని, నర్సీపట్నం మున్సిపాలిటీలో ఆస్తి పన్ను 25 శాతం తగ్గించిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ సహకారంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉన్నందున, దేవత అరుణను ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని కోరారు.  అభ్యర్థిని దేవత అరుణ మాట్లాడుతూ రాజకీయం అంటే ప్రజాసేవ అనే ఉద్దేశ్యంతో, వార్డు కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నానని,  వార్డు సమస్యలపై కౌన్సిల్లో తన వాణిని వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు.  ఈ కార్యక్రమంలో పెదిరెడ్ల  శ్రీనివాసరావు, పెదిరెడ్ల కుమార్,  సురేష్, పద్మనాభుని కన్నయ్యశెట్టి, లాలం చినఅప్పారావు, తాటికొండ బ్రహ్మలింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...