Followers

యాబై వేల ఆర్థిక సహాయం

 యాబై వేల ఆర్థిక సహాయం

లక్షెట్టిపెట్,పెన్ పవర్

ఇల్లు కట్టుకోవడానికి యాబై వేలు ఆర్థిక సాయం తిర్యాని మండలం నిరుపేద కుటుంబానికి చెందిన వసంత అనే మహిళ సొంత ఇల్లు లేక గత 30 సంవత్సరాలుగా అద్దె ఇంట్లో ఉంది ఇటీవల వసంత కు ఇల్లు నిర్మించుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించింది కానీ ఆమె వద్ద ఇల్లు కట్టుకోవడానికి నయా పైసలు లేకపోవడంతో ఇల్లు కట్టుకోవడం ఆపేసింది ఈ విషయం పలువురి ద్వారా తెలుసుకున్న లక్షెట్టిపెట్ హిందూ ఉత్సవ సమితి గౌరవ సలహాదారులు మైలారం శ్రీనివాస్ స్పందించి తనకున్న పరిచయాలతో హైదరాబాదులో వైద్య పూర్తి నిర్వహిస్తున్న టి హర్షిత్ రెడ్డి ని సంప్రదించగా ఆయన మానవతా దృక్పథంతో స్పందించి రూ ఇరువై ఐదు వేల రూపాయలు ఇల్లు నిర్మించుకోవడానికి అందజేశారు అదేవిధంగా శ్రీనివాస్ తో పాటు తన కుటుంబ ఆత్మీయులతో సంప్రదించి మరో ఇరవై ఐదు వేల రూపాయలను సేకరించి శుక్రవారం రోజున స్థానిక వైష్ణవి మహిళా కళాశాల లో నిరుపేద అయిన వసంతం ఆహ్వానించి రూపాయల యాభై వేల నగదును అందజేశారు దాతలు లో ఒకరైన నా వైష్ణవి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ కరస్పాండెంట్ ఆకుల కిరణ్ హిందూ సమితి గౌరవ సలహాదారులు మైలారం శ్రీనివాస్ చేతుల మీదుగా నగదు రూపాయలను ఆమెకు అందజేశారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...