వీది వ్యాపారులకు బ్యాంకు లావాదేవీలపై అవగాహన కార్యక్రమం..
దుండిగల్,పెన్ పవర్
వీధివ్యాపారులను చైతన్య పరిచేందుకు గాను.. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ సత్యనారాయణ ఆదేశాలతో ప్రతి శనివారం వీధి వ్యాపారులకు అవగాహన కార్యక్రమాలను బ్యాంకుల వద్ద నిర్వహించే కార్యక్రమములో బాగంగా శనివారం ఎస్.బి.ఐ బౌరంపేట్ గండిమైసమ్మ బ్రాంచ్, ఎస్.బి.ఐ దుండిగల్ బ్రాంచ్ మరియు ఎస్.బి.ఐ ధూలపల్లి బ్రాంచ్ లో, మరియు యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆంధ్రా బ్యాంకు) గండిమైసమ్మ బ్రాంచ్ లో వీధీ వ్యాపారులకు క్యాంపు నిర్వహించారు.. రుణాల మంజూరు, పంపిణీ మరియు డిజిటల్ పద్దతిలో లావాదేవీలను ఎలా చేయాలి అనే విషయాలను వీదీవ్యాపారులకు వివరించారు.., ఈ కార్యక్రమములో ఎస్.బి.ఐ బౌరంపేట్ బ్యాంకు మేనేజర్ ప్రవీణ్ కుమార్, ఎస్.బి.ఐ దుండిగల్ బ్యాంకు మేనేజర్ సిద్ధార్థ్, ఎస్.బి.ఐ ధూలపల్లి బ్యాంకు మేనేజర్ ప్రసాద్, జిల్లా మెప్మ కోఆర్డినేటర్ అనిల్, సిఓ మంజుల, మున్సిపల్ మహిళా ఆర్.పి లు, వీది వ్యాపారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment