ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలి
కోవిడ్ వ్యాక్సిన్ పై అపోహలు వద్దుప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలి
పెన్ పవర్, కందుకూరు
ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలి అని వ్యాక్సిన్ పై వచ్చే అపోహలు నమ్మవద్దని స్థానిక శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని మాచవరం గ్రామం లోని ఉన్నత పాఠశాలలో కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తుంటే కొంతమంది అపోహలు అనుమానాలు వల్ల ప్రాణాలకే ముప్పు ఏర్పడే అవకాశం ఉందని అన్నారు. ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ తప్పనిసరిగా పాటించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మీ కోసం కాదు మీ వలన కుటుంబాలు తద్వారా గ్రామాలకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉన్నందున ఎవరికి వారు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా వ్యాక్సిన్ వేయించుకోవాలి అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా అందరినీ భయబ్రాంతులకు గురి చేసింది కరోనా. కరోనా వలన ప్రాణాలు కోల్పోతే దగ్గర వారికి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని దిక్కులేని చావు మనం కళ్లారా చూశామని అన్నారు. కావున ప్రభుత్వం అందిస్తున్న వ్యాక్సిన్ ను ప్రతి ఒక్కరూ సకాలంలో తీసుకోవాలని అన్నారు. అది సంఘ పరంగా తీసుకునే ఆలోచనలు గా ఉండాలని వ్యక్తిపరంగా తీసుకునే ఆలోచన ఉండకూడదని అన్నారు. వ్యాక్సిన్ వేయించుకుని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. దేశవ్యాప్తంగా ఉచితంగా వాక్సిన్ వేస్తుంటే మనవాళ్లు ముందుకు రావడం లేదని ఇది చాలా బాధాకరం అని, అనేక దేశాలు మన దేశాన్ని వ్యాక్సిన్ కావాలని పదేపదే అడుగుతున్నాను. కానీ మన వారు ఇంకా అవగాహన లోపంతో ఉండటం దురదృష్టకరమన్నారు. ఇప్పటికీ వ్యాక్సిన్ వేయించుకోవడం కోసం ముందుకు రాకపోతే భవిష్యత్తులో అది క్షమించరాని నేరం అవుతుందని అన్నారు. ఇతర వ్యాధుల వల్ల వేరే వేరే కారణాల వల్ల చనిపోతే ఈ వ్యాక్సిన్ వల్ల చనిపోయారని అసత్య ప్రచారం చేస్తున్నారని ఈ వ్యాక్సిన్ వల్ల ఒక్కరు కూడా చనిపోలేదని అన్నారు. వేక్సిన్ వేయించుకుంటే 70 శాతం రక్షణ, 30 శాతం మనం స్వీయ నియంత్రణ పాటించాల్సిందేనని అన్నారు. మాస్కులు, శానిటైజర్, సామాజిక దూరం తప్పక పాటించాలని అన్నారు. నిర్లక్ష్యం వహిస్తే నిండు ప్రాణం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. అనేక నగరాలలో ప్రైవేటు వైద్యశాలలో వ్యాక్సిన్ వేయించుకుంటే 250 రూపాయలు చెల్లించాలని కానీ ప్రభుత్వం ఉచితంగా మండల కేంద్రాలలో అందుబాటులో ఉంచితే ప్రజల ముందుకు రాకపోవడం నిజంగా బాధాకరమన్నారు. మాచవరం గ్రామంలో 170 మంది ఇంతవరకు వ్యాక్సిన్ వేయించుకోవడం బాధాకరమని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. దేశవ్యాప్తంగా కరోన కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుందని సెకండ్ వేవ్ ప్రమాదకరంగా వస్తుందని అన్నారు.
కరోనా సోకిన వారు మద్రాస్ లాంటి హాస్పిటల్ సుమారు 20 లక్షల రూపాయలు చెల్లించి ఇంటికి తిరిగి వచ్చారని కావున ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. సామాన్య కుటుంబాలకు కరోనా శాపంగా మారకూడదు అని ప్రభుత్వమే ముందుగా వ్యాక్సిన్ ఉచితంగా ప్రవేశపెడితే ఎన్ని సార్లు చెప్పిన ముందుకు రాకపోవడం బాధాకరమని అన్నారు. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే కరోనా శరీరంలోకి త్వరగా ప్రవేశిస్తుందని అలాంటి వారు ముందుగానే వ్యాక్సిన్ వేయించుకోవాలి అని అన్నారు. 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలి అని అన్నారు. ప్రభుత్వ పథకాలు అందుకనే ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకునేలా చూడాలని అన్నారు. అనంతరం గ్రామస్తులు అందరికీ కోవిడ్ వ్యాక్సిన్ వేయించేలా చూశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ ప్రియంవద, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ స్వాతి, తహసిల్దార్ సీతారామయ్య, రూరల్ ఎస్ఐ కొత్తపల్లి అంకమ్మ, సర్పంచ్ లలిత, హెచ్ఎం మాల్యాద్రి, కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, సూరం వేణుగోపాల్ రెడ్డి, హేమంత్ రెడ్డి, గ్రామస్తులు, వైద్య ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment