Followers

ఘనంగా తేదేపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

 ఘనంగా తేదేపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు       

పెన్ పవర్, కందుకూరు

తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ఏర్పడిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40సంవత్సరాలు అయిన శుభ సందర్భంగా కందుకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కందుకూరు పట్టణంలోని అంబేడ్కర్ బొమ్మ సెంటర్లో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేసి కేక్ కటింగ్ చేసిన అనంతరం యన్.టి.ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించినట్లు తెలుగుదేశం పార్టీ యస్.సి సెల్ జిల్లా కార్యదర్శి గోచిపాతల మోషే ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగుదేశం పార్టీ  పేద , బడుగు బలహీనవర్గాల కోసం ఏర్పాటు చేసిన పార్టీ అని తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసి 40 సంవత్సరాలు గడచిన ఇప్పటికీ పేదల పక్షాన నిలబడి , తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ తేదేపా నేనని మోషే తెలిపారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి ప్రజలకు సంక్షేమ , అభివృద్ధి కార్యక్రమాలు ద్వారా సేవలందించిన ఏకైక మహాన్నత వ్యక్తి యన్.టి.ఆర్ అని తెలియజేశారు. ఈకార్యక్రమంలో ఎ.యం.సి మాజీ చైర్మన్ గట్టమనేని చెంచురామయ్య , పట్టణ పార్టీ ఉపాధ్యక్షుడు షేక్ రఫీ , తెలుగు యువత పట్టణ అధ్యక్షులు చిలకపాటి మధు , మహాదేవపురం సొసైటీ మాజీ అధ్యక్షులు దామా మల్లేశ్వరావు , కొండముడుసుపాలెం ఉప సర్పంచ్ పొడపాటి మహేష్ , ఎ.యం.సి మాజీ డైరెక్టర్ రెబ్బవరపు మాల్యాద్రి , తేదేపా సీనియర్ నాయకులు బైరపనేని కోటయ్య , ఈదర నరసయ్య , కలవకూరి యానాది , అండ్ర వెంకటేశ్వర్లు ,  టి.ఎన్.ఎస్.ఎఫ్ నాయకులు  బెజవాడ ప్రసాదు , నలమోతు శ్రీహరి , పిన్నమరాజు ప్రభాకరరావు , రామూర్తి , ఆనందరావు , శేషయ్య , శేషగిరిరావు , లక్ష్మణరావు , చుండూరి.శ్రీను , జీయా , కరిముల్లా  , వలేటివారిపాలెం మండల యస్.సి సెల్ అధ్యక్షులు బద్దపూడి సంజీవరావు, బి.సి సెల్ కందుకూరు మండల అధ్యక్షులు మంచికలపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...