డస్ట్ బిన్ రహిత నగరం
విజయనగరం,పెన్ పవర్రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన క్లాప్ కార్యక్రమం విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ ఎస్ వర్మ కోరారు. బుధవారం సాయంత్రం ఈ మేరకు పారిశుద్ధ్య అధికారులు, పర్యవేక్షకులు, కార్యదర్శులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరాలు, పట్టణాలు పరిశుభ్రత,పచ్చదనంతో పరిఢమిల్లాలని ప్రభుత్వం క్లాప్ కార్యక్రమాన్ని రూపొందించిందన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో వార్డుల్లో పరిశుభ్రత కు అధిక ప్రాధాన్యత ఇచ్చి పచ్చదనంతో వెల్లి విరియాలని అన్నారు. వార్డులలో సమూల మార్పులు తీసుకొచ్చి పచ్చదనానికి, పర్యావరణానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. డస్ట్ బిన్ రహిత నగరంగా తీర్చిదిద్దడం లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. సంపూర్ణ చైతన్యాన్ని ప్రజలలో తీసుకొచ్చి తద్వారా క్లాప్ కార్యక్రమ విశిష్టతను చాటి చెప్పాలన్నారు. ఈ సమావేశంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment