నూతన సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేసిన సిరిపురపు
పరవాడ,పెన్ పవర్
మండల మేజర్ పంచాయతీ పరవాడ గ్రామ సర్పంచిగా గా సిరిపురపు అప్పలనాయుడు,ఉప సర్పంచ్ బండారు రామారావు ప్రమాణస్వీకారం చేశారు.ఈ సందర్భంగా పరవాడ సర్పంచ్ సిరిపురపు అప్పలనాయుడు మాట్లాడుతూ పరవాడ గ్రామ పంచాయతీ కోసం తాను అహర్నిశలు శ్రమించి మంచి పనులు చేఇస్తూ గ్రామ పురోభివృద్ధి కృషి చేస్తాను అని ప్రమాణం చేస్తున్నాను అని అన్నారు.తన విజయానికి ఎంతగానో కృషి చేసిన పయిల శ్రీనుకు,రామునాయుడు కి కార్యకర్తలకు,స్థానిక నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సీఈసీ సభ్యులు పయిల శ్రీనివాసరావు,జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్క రాము నాయుడు, పరవాడ ఎం.పి.డి.ఓ హేమ సుందర రావు,ఈ. ఓ.పి.ఆర్.డి పద్మజ, పంచాయతీ అధికారి అచ్చుత రావు,మాజీ ఆర్.ఈ.సి.ఎస్ చైర్మన్ చల్ల కనకరావు,పి.ఎమ్.సి చైర్మన్ పయిల హరీష్, వార్డు మెంబెర్లు, పంచాయతీ సిబ్బంది, సచివాలయం సిబ్బంది, గ్రామ వాలంటీర్స్, వై.సి.పి కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment