ఉపాధి పనులు పరిశీలన
తాళ్ళూరు,పెన్ పవర్తాళ్లూరు మండలంలో ప్రతి ఒక్కరికి వంద రోజుల ఉపాధి పనులు కల్పించాలని ఎంపీడీవో కేవీ కోటేశ్వరరావు అన్నారు. మండలం లోని తూర్పు గంగవరం గ్రామంలో శుక్రవారం జరుగుతున్న ఉపాధి పనులను ఆయన పరిశీలించారు. ఎంపీడీవో మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ మొదలైందని,కూలీలందరూ సామాజిక దూరం పాటిస్తూ, మాస్క్ లు ధరించాలని అన్నారు. కూలీలు ఇచ్చిన కొలతలు ప్రకారం పని చేస్తే వారికి రోజుకు 250 రూపాయలు కూలీ వస్తుందన్నారు.కూలీలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఫిల్డు అసిస్టెంట్ కు సూచించారు.ఆయన వెంట ఈసీ ప్రసాద్,టీఏ, ఎఫ్ఏ ఉన్నారు.
No comments:
Post a Comment