జాతరకు వచ్చే భక్తులు అధికార యంత్రాంగానికి సహకరించాలి
అదికారులు సమన్వయంతో కలసి పనిచేయాలి.
జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి.
సూర్యాపేట,పెన్ పవర్
ఆదివారం అర్థరాత్రి ప్రారంభమైన పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర కు రాష్ట్రం లోని వివిధ జిల్లాల నుండి వేలాదిమంది తరలి వస్తున్నారు.సోమవారం జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి పెద్దగట్టు దేవాలయం వద్ద అధికారులతో కలిసి స్వయంగా జాతర ను పర్యవేక్షిస్తూ భక్తులకు ఇబ్బంది కలగకుండా ఎప్పటి కప్పుడు అధికారులకు సూచనలు చేస్తున్నారు. జాతర లో పారిశుధ్య చర్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా భక్తులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, శానిటైజర్ తో చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. పర్యావరణ కాలుష్యం లేకుండా ప్లాస్టిక్ రహిత జాతర గా నిర్వహించేందుకు భక్తులు జిల్లా యంత్రాంగం తో సహకరించాలని కోరారు.
No comments:
Post a Comment