క్రికెట్ విజేతలకు బహుమతులు అందించిన మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
కన్నెపల్లి, పెన్ పవర్మంచిర్యాల జిల్లా భీమిని కన్నేపల్లి మండల స్థాయి క్రికెట్ పోటీలు కొక్కీరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో నిర్వహించారు. గత వారం రోజుల నుండి నిర్విరామంగా కొనసాగిన ఈ పోటీలో విజేతలుగా నిలిచిన జట్లకు మాజీ ఎమ్మెల్సీ కొక్కిరల ప్రేమ్ సాగర్ చేతుల మీదుగా బహుమతులు ఇవ్వడం జరిగింది.మొదటి బహుమతి కన్నేపల్లి గ్రామానికి చెందిన జట్టుకు 75000 రూపాయిల చెక్కుని రెండవ బహుమతి వెంకటపూర్ జట్టుకు 40000 రూపాయిలు ,మూడవ బహుమతిగా మడవెల్లి గ్రామ జట్టుకు,నాలుగోవ బహుమతి సర్జపూర్ జట్లకు 20000 రూపాయిల బహుమతి చెక్కులు ఇవ్వడం జరిగింది. తదనంతరం ప్రేమ్ సాగర్ మాట్లాడుతూ యువతలో క్రీడా స్ఫూర్తిని నింపెందికే ఈ పోటీలు నిర్వహించామని యువత మంచి ఆరోగ్యంతో , శరీర పట్టు సాధించాలన్నారు. ఈ కార్య్రమంలో భీమిని జెడ్పీటీసీ పోతు రాజుల గంగమ్మ, నెన్నేల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బ్రమ్మయ్య ,వేంకటపూర్ సర్పంచ్ దారిశెట్టి వెంకన్న ,టీపీసీసీ సోషల్ మీడియా బెల్లంపల్లి నియోకవర్గ కో ఆర్డనేటర్ ఎల్పుల రోహిత్ ,కేశవ్ కందుల బానేశ్,క్రికెట్ క్రీడా కారులు అభిమానులు తదిదరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment