Followers

సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా గ్రామదేవతల వేడుకలు

సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా గ్రామదేవతల వేడుకలు

వి.మాడుగుల,పెన్ పవర్

 సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా గ్రామ దేవతల  వేడుకలు శోభిల్లుతూ ఉన్నాయని ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడు అన్నారు. మంగళవారం మాడుగుల ఇలవేల్పు ఉత్తరాంధ్ర ఆరాధ్యదైవం శ్రీ మోదకొండమ్మ తీర్థ మహోత్సవం సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఎడ్ల బళ్ళ పందాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  పల్లెల్లో ప్రతి చోట గ్రామదేవతల తీర్థ మహోత్సవాలు జాతరలు  అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారని  అందువల్ల భక్తి శ్రద్ధలు  గ్రామం సుభిక్షంగా ఉంటుందని  అన్నారు. తీర్థ మహోత్సవాలు కారణంగా భక్తులు బంధువులు స్నేహితులు కలుసుకోవడం విందులు వినోదాలు చేసుకోవడం జరుగుతుందన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల వల్ల తీర్థ మహోత్సవాలకు ఆదరణ  కలుగుతుందన్నారు. ఎడ్లబండ్ల పోటీలు గుర్రపు పందాలు  నిర్వహించడం వల్ల పోటీతత్వం పెరుగుతుందన్నారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి  నిరంతరం కృషి చేస్తుందన్నారు. రహదారులు  డ్రైనేజీలు  లింకు రోడ్లు నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. గిరిజన ప్రాంతాల్లో రహదారులకు మెరుగుపరచాలని కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారు. పేద ప్రజల సంక్షేమమే  వైయస్ జగన్ లక్ష్యం అని  అమ్మ ఒడి జగనన్న చేయూత  తదితర  సంక్షేమ పథకాలు  పేద ప్రజలకు చేరువ అవుతుందని అన్నారు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో  వైయస్ జగన్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి   అభివృద్ధికి చేయూతనివ్వాలని  ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడు  అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...