కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎస్సై రామారావు
వి.మాడుగుల,పెన్ పవర్కోవిడ్-19 పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాడుగుల పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పి. రామారావు అన్నారు. శనివారం బస్టాండ్ ఆవరణలో పోలీసులు మహిళా పోలీసులుతో మానవహారం నిర్వహించారు. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని ఆయన కోరారు. మండలంలోని ప్రజలు మాస్కులు ధరించి సానిటేషన్ తప్పనిసరిగా చేయాలని సూచించారు.
వ్యాపారులు హోటల్ లో కూడా భౌతిక దూరం శానిటైజర్ లో తప్పక ఉపయోగించాలని ఆయన కోరారు. గ్రామాల్లో మహిళా పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపడతారు. కోవిడ్ 19పై పోలీసు నిఘా ఉంటుందని నిబంధనలు పాటించని వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు శానిటైజర్ తప్పనిసరిగా ఉపయోగించాలని కోరారు. పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులు నిబంధనలను తూచా అమలు చేయాలని ఎస్సై రామారావు కోరారు
No comments:
Post a Comment