కమ్యూనిటీ పారామెడిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మెడికవర్ హాస్పిటల్ వారిచే వైద్య విజ్ఞాన సదస్సు
గాజువాక, పెన్ పవర్
గాజువాక లో హోటల్ గ్రీన్ యాపిల్ లో జరిగిన కమ్యూనిటీ పారామెడిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మెడికవర్ హాస్పిటల్ వారిచే వైద్య విజ్ఞాన సదస్సు జరిగింది. ఈ సమావేశంనకు సిహెచ్ ప్రభాకర్ (ప్రెసిడెంట్) ఆర్ ఎం పీ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షత వహించితిరి మెడికవర్ హాస్పిటల్ డాక్టర్స్ మాట్లాడుతూ కరోనా మరియు కీళ్ళ వ్యాధులు శ్వాసకోస వ్యాధులు కోసం తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చర్చించడం జరిగింది.
ఈ సదస్సులో మెడికవర్ హాస్పిటల్ ఏ జీ ఎం, శ్రీనివాసరావు, ఉమామహేశ్వర రెడ్డి పాల్గొన్నారు.ఈ వైద్య విజ్ఞాన సదస్సుకు గాజువాక, విశాఖపట్నం మరియు పరిసర ప్రాంతాల నుండి ఎందరో ఆర్ఎంపీ డాక్టర్స్ పాల్గొనడం జరిగినది.ఈ కార్యక్రమం ముగింపు సభకు ఆర్ఎంపీ డాక్టర్స్ అసోసియేషన్ కోశాధికారి తంగుడు రామారావు,మెడికేర్ హాస్పిటల్ డాక్టర్స్ యాజమాన్యం మరియు హాజరైన ఆర్ఎంపీ డాక్టర్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంపీ డాక్టర్ సంఘం ప్రతినిధులు డిఎ రాజు ,టిఎస్ నాయుడు ఏ శ్రీనివాసరావు,ఓ. శంకర్రావు,రాంప్రసాద్,వరప్రసాద్, సూరి బాబు, ముకుంద,నరసారావు,పాల్గొన్నారు.
No comments:
Post a Comment