అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక తగ్గింపు
పెన్ పవర్,విజయనగరంఅంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నూతన వస్త్రాల కొనుగోళ్ళు, మొబైల్ ఫోన్లు కొనుగోళ్ళు పై ప్రత్యేక రాయితీలు ఇచ్చే విధంగా జిల్లా పోలీసుశాఖ చర్యలు చేపట్టినట్లుగా జిల్లా ఎస్పీ బి.రాజకుమారి శక్రవారం నాడు తెలిపారు. రాష్ట్ర డిజిపి శ్రీ గౌతం సవాంగ్ గారి ఆదేశాలతో జిల్లాలో టెక్స్ టైల్స్ మరియ మొబైలు షాపుల యజమానులతో పోలీసు అధికారులు సంప్రదింపులు జరిపి, అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకొని, నూతన వస్త్రాలు, మొబైలు కొనుగోళ్ళు పై ప్రత్యేక రాయితీని కల్పించిందన్నారు. మహిళలు తమ మొబైల్స్ లో దిశ మొబైల్ ఎస్ఓఎస్ యాప్ ను చూపి నూతన వస్త్రాల కొనుగోళ్ళు పై 20-30 శాతం ప్రత్యేక రాయితీ పొందవచ్చునన్నారు. అదే విధంగా మొబైల్స్ కొనుగోళ్ళు చేసే మహిళలు తమ మొబైల్ దిశ యాప్ ను చూపి 10శాతం ప్రత్యేక రాయితీని పొందవచ్చునన్నారు. ఈ సదుపాయం కేవలం మార్చి 8న మాత్రమే వర్తిస్తుందని జిల్లా ఎస్పీ తెలిపారు. పోలీసుశాఖ అభ్యర్ధన మేరకు ప్రత్యేక రాయితీ ఇచ్చేందుకు ముందుకు వచ్చిన వస్త్ర, మొబైల్ వ్యాపారులకు జిల్లా ఎస్పీ బి. రాజకుమారి కృతజ్ఞతలు తెలిపారు.
No comments:
Post a Comment