కరెంట్ స్తంభాలు,వీధిదీపాలు వేయాలని మున్సిపల్ కమిషనర్ కు వినతి
మందమర్రి, పెన్ పవర్
కరెంట్ స్తంభాలు లేని ఏరియాలో స్తంభాలు వేయాలని రామకృష్ణాపూర్ 16వ వార్డు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రధాన కార్యదర్శి కలవల సతీష్ కుమార్ శుక్రవారం క్యాతనపల్లి మున్సిపాలిటీ కమీషనర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దుర్గారావు మార్కెట్ ఏరియా, గంగా కాలనీ ఏరియాల్లో కొన్ని చోట్ల కరెంట్ స్తంభాలు, వీధి దీపాలు లేకపోవడంతో ఆ ఏరియా ప్రజలు చీకట్లో జీవిస్తున్నారని ఆయన అన్నారు. విష సర్పాలు ఇండ్లలోకి వస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీనిపై మున్సిపల్ కమీషనర్ సమస్య పట్ల అనుకూలంగా స్పందించి, పరిష్కరానికి కృషి చేస్తానని తెలిపినట్లు ఆయన తెలిపారు.
No comments:
Post a Comment