Followers

మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం

 మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం


కూకట్ పల్లి, పెన్ పవర్

శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ లో నివసించే అయూబ్ , యూసఫ్, చిన్న అనే వ్యక్తులు వివిధ అనారోగ్య కారణాలవల్ల మృతి చెందారు. విషయం తెలుసుకున్న డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్  ఆదేశాల మేరకు యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ బాధిత కుటుంబాలను పరామర్శించి అంత్యక్రియల నిమిత్తం ఆర్థిక సహాయం అందజేశారు. డివిజన్ ప్రజలకు ఎప్పుడు ఎలాంటి సమస్యలు వచ్చిన తమదృష్టికి తీసుకురావాలని, ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తామని ఈసందర్భంగా ఆయన తెలియజేసారు. ఈకార్యక్రమంలో ఏరియా కమిటీ సభ్యులు షౌకత్ అలీ మున్న, షాహిద్ అలీ, షఖీల్ మున్న, నాగరాజు, ఫజల్, ఫారూఖ్, ఖలీమ్, ప్రీతి, అరుణ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...