విద్యావ్యవస్థను అస్తవ్యస్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.
బీజేవైఎం హైదరాబాద్ సిటీ సెక్రటరీ ప్రవీణ్ కుమార్
తార్నాక ,పెన్ పవర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థను పూర్తిగా అస్తవ్యస్తంగా తయారు చేసారని బీజేవైఎం హైదరాబాద్ సిటీ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదంతో యువకులు,మేధావులు,అనేక మంది అమరవీరుల త్యాగ ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిందని , తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయని కళలు కన్న యువకుల ఆశయాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అడియాశలు చేసారని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో 28వేల ఉపాధ్యాయుల పోస్టులు కాళీలుగా ఉన్నాయని, అదే విధంగా 14 యూనివర్సిటీ లకు వైస్ ఛాన్స్ లర్స్ , ప్రొపెసర్లు, లెక్చరర్లు లేనటువంటి పరిస్థితి ఏర్పడిందని అన్నారు. విద్యారంగంలో ఆంధ్ర మేనేజ్మెంట్ ను ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, విద్యారంగంలో తెలంగాణ ప్రభుత్వం శ్రీ చైతన్య,నారాయణ లాంటి ఆంధ్ర మేనేజ్ మెంట్ ను ప్రోత్సహిస్తున్నరని అన్నారు. కేజీ టూ పీజీ ఉచిత విద్యాను అందిస్తామని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం విద్యావ్యవస్థ ను అస్తవ్యస్తం చేసారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. శాసన మండలిలో ప్రశ్నించే గొంతు రాంచందర్ రావు గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
No comments:
Post a Comment