Followers

కుషాయిగూడలో ఆహుతైన కూలర్, పర్నిచర్ షాపులు

 కుషాయిగూడలో ఆహుతైన కూలర్, పర్నిచర్ షాపులు

ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు

భాదితులకు భారీగా అస్తి నష్టం 

పరమర్షించిన ఎమ్మెల్యే, మాజీ మేయర్






పెన్ పవర్,  మల్కాజిగిరి 

మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది, స్థానిక వెంకటేశ్వరస్వామి దేవాస్థానం ఎదురుగా ఉన్న కాలి స్థలంలో సీజనల్ గా ఏర్పాటు చేసిన ఎయిర్ కూలర్ షాప్ ల్లో ఆదివారం రాత్రి మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రెండు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఆస్తి నష్టం భారీగా జరిగిందని భాదితులు వాపోయారు. కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకొని దార్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్నా మాజీ నగర మేయర్ బొంతు రామ్మోహన్ ఘటన స్ధాలనికి చేరుకొని ప్రమాదానికి కారణలు అడిగి తెలుసుకున్నారు. భాదితులకు అండగా ఉంటామని అన్నారు. అగ్నిప్రమాదం జరిగి నష్టపోయిన భాదితులను ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుబాష్ రెడ్డి, చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి బాధితులను పరామర్షించారు, అగ్నిప్రమాదంలో నష్టపోయిన బాధితులను అన్ని విధాలుగా అదుకుంటామని అన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...