మతిస్థిమితం కోల్పోయి పెన్ గంగ నది లో పడి మహిళ మృతి...
బేలా, పెన్ పవర్ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని బెదోడ గ్రామానికి గౌర్కర్ మందాబాయి (60) అనే మహిళ మతిస్థిమితం కోల్పోయి పెన్ గంగ నదిలో పడి మృతి చెందిన సంఘటన శుక్రవారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బేల ఎస్ఐ సాయన్న తెలిపిన కథనం ప్రకారం గత సంవత్సరం నుంచి మతిస్థిమితం బాగోలేక,గత గురువారం తెల్లవారుజామున ఇంట్లో ఎవరికీ చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయి, శుక్రవారం తెల్లవారుజామున 8 గంటలకు గ్రామానికి ఆనుకొని ఉన్న పెన్ గంగా నదిలో నీట మునిగి శవమై కనిపించిందని అన్నారు. ఆమె మతిస్థిమితం వల్ల పేన్ గంగా నది నీటిలో పడి చనిపోయిందని, మృతురాలి కుమారుడు గౌర్కర్ మంగేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై సాయన్న తెలిపారు.
No comments:
Post a Comment