కరోనా నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో హాళీ నిషేదం
విజయనగరం,పెన్ పవర్ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ శ్రీమతి బి. రాజకుమారి మార్చి 27, శనివారం నాడు పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారి మరలా విజృంభిస్తున్నతరుణంలో మార్చి 29న జరగబోవు హోళీ పండగను కరోనా జాగ్రత్తలు తీసుకొంటూ, కుటుంబ సభ్యులతో మాత్రమే జరుపుకోవాలన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా బహిరంగ ప్రదేశాల్లో హెూళీ వేడుకలను నిర్వహించడాన్ని ప్రభుత్వం నిషేదించిందన్నారు. కావున, ప్రజలందరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, హెూళీ వేడులను బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించకూడదన్నారు. హెూళీ వేడుకలను కేవలం కుటుంబ సభ్యులతో, సాంప్రదాయక పద్దతిలో మాత్రమే నిర్వహించుకోవాలన్నారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమించి, హెూళీ వేడుకలను బహిరంగ ప్రదేశాల్లో నిర్వహిస్తే వారిపై డిజాస్టర్ మేనేజ్ మెంట్ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రతీ ఒక్కరూ వ్యక్తుల మధ్య సామాజిక దూరం పాటించాలని, మాలు తప్పనిసరిగా ధరించాలని, శానిటైజర్లును వినియోగించాలని ప్రజలకు జిల్లా ఎస్పీ బి.రాజకుమారి సూచించారు. కరోనా వ్యాధి ఒకరు నుండి మరొకరికి త్వరితగతిన వ్యాప్తి చెందుతున్నందున ప్రజలందరూ కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. హోళీ పండగ సందర్భంగా ఎవరైనా రోడ్ల పైన గాని, బహిరంగ ప్రదేశాల్లోగాని, విద్యా సంస్థలోగాని వేడుకలను మూకుమ్మడిగా నిర్వహిస్తే, కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా ప్రతీ ఒక్కరూ కరోనా నిబంధనలు పాఠించాలన్నారు. నిబంధనలు పాఠించని వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవన్నారు. కరోనా నిబంధనలు పాటించకండా, బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా హెూళీ వేడుకలను నిర్వహిస్తే, వారి పై డిజాస్టర్ మేనేజ్ మెంట్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ బి. రాజకుమారి అన్నారు. కరోనా వ్యాప్తి కాకుండా ప్రజలందరూ పోలీసుశాఖ చేపట్టే చర్యలకు సహకరించాల్సిందిగా ప్రజలకు జిల్లా ఎస్పీ బి.రాజకుమారి విజ్ఞప్తి చేసారు.
No comments:
Post a Comment