స్విమ్మింగ్ క్రీడలో
విజయనగరం, పెన్ పవర్స్విమ్మింగ్ క్రీడలో కూడా జాతీయస్థాయిలో విజయనగరానికి పేరు తీసుకు రావడం ఎంతైనా అభినందనీయమని విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఈ నెల 21, 22 తేదీలలో బెంగళూరులో జరిగిన జాతీయ పారా స్విమ్మింగ్ పోటీలలో విజయనగరానికి చెందిన దాసరి సూరజ్ సంపత్ కుమార్ సిల్వర్ మెడల్ సాధించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోలగట్ల ను వారి నివాసంలో బుధవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. స్విమ్మింగ్ లో మంచి ప్రతిభ కనబరచి, జాతీయస్థాయిలో సిల్వర్ మెడల్ సాధించడం పట్ల ఎమ్మెల్యే కోలగట్ల సూరజ్ సంపత్ ను, వారి తల్లిదండ్రులను అభినందించారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించాలని ఎమ్మెల్యే కోలగట్ల అభిలషించారు. సూరజ్ సంపత్ కుమార్ కు అభినందించిన వారిలో సీఈవో నాగేశ్వరరావు, చీఫ్ కోచ్ వెంకటేశ్వరరావు, కార్పొరేటర్ భవి రెడ్డి సతీష్, రామేశ్వర పు రామారావు, స్విమ్మింగ్ కోచ్ నాయుడు, తల్లిదండ్రులు దాసరి కుమార్, శ్రీమతి నవ్య ఉన్నారు...
No comments:
Post a Comment