ఎక్సైజ్ అధికారుల మెరుపు దాడులు
సిరిసిల్ల ,పెన్ పవర్
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరవుపేట మండలం లోని లయన్ తండా, కమ్మరిపేట తండా, గోవిందరావుపేట తండా, లచ్చపేట తండా లలో ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ వలయాధికారి ఎంపీఆర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు చేసి 120 లీటర్ల బెల్లం పానకాన్ని గుర్తించి ధ్వంసం చేసారు. లీటర్ల నాటుసారా సీజ్ చేసారు .ఈ నాటు సారా తయారీ కి బాధ్యులు అయినటువంటి వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.ఎవరైనా గుడుంబా తయారుచేసినా, అమ్మినా వారిపై కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.. ఈ దాడుల్లో జిల్లా ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ ఎస్సై కిషన్, ట్రైనీ ఎస్సైలు శ్రీకాంత్, శేఖర్ లతో పాటు హెడ్ కానిస్టేబుల్స్ వెంకటేశ్వరావు, హకానీ, అబ్దుల్లా, మజీద్ మరియు కానిస్టేబుల్స్ శంకర్, హమీద్,సుమన్, రాజేందర్, శ్రీనివాస్, రాకేష్, పర్శరామ్, సుమలత, రజిత పాల్గొన్నారు.
No comments:
Post a Comment