Followers

బాలల హక్కుల కోసం ప్రతిఒక్కరు పోరాడాలి

 బాలల హక్కుల కోసం ప్రతిఒక్కరు పోరాడాలి

విశాఖపట్నం సిటీ,పెన్ పవర్

నేటి సమాజంలో బాలబాలికల హక్కులకోసం కృషి చేస్తున్న స్వచ్చందసేవాసంస్థల పనితీరుపట్ల విశాఖ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి కే కే వీ బులికృష్ణ సంతృప్తి వ్యక్తం చేసారు.మంగళవారం పౌరగ్రంధాలయంలో చైల్డ్ లైన్ మరియు సీడ్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా ఏర్పాటుచేసిన సమావేశానికి అయన ముఖ్య అతిధిగా హాజరై ఉపన్యసించారు.బాలల సంక్షేమం కోసం పనిచేస్తున్న స్వచ్చంద సంస్థలకు అన్నివిధాలా సహకరిస్తామని తెలిపారు.చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ శ్యామలారాణి మాట్లాడుతూ బాబా బాలికల రక్షణ కోసం ప్రత్యేకంగా 1098 టోల్ ఫ్రీ నెంబర్ కేటాయించినట్లు తెలిపారు.

చిన్నపిల్లలు తల్లి తండ్రుల నుంచి కానీ,సవతి తల్లిదండ్రుల నుంచి కానీ బంధువులనుంచి కానీ ఎటువంటి వేధింపులు ఎదుర్కొన్నా 1098 కు తెలియపరిస్తే తమకు సమాచారం వస్తుందని వెంటనే తాము తగిన చర్యలు  తీసుకుంటామన్నారు.కరోనా లాక్ డౌన్ సమయంలో ఎక్కువగా పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు.బాల్యవివాహాలు,లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయని తెలిపారు. పిల్లలమీద వేధింపులు,బాల్యవివాహాలు వంటి మీద ఒక్కోరకంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.బాలబాలికల రక్షణే  ముఖ్యోద్దేశమని తెలిపారు.ఈ సమావేశంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ సీతా మహాలక్ష్మి,జిల్లా ప్రొబేషన్ అధికారి సత్యనారాయణ,  చైల్డ్ లైన్ డైరెక్టర్ సన్యాసి రాజు తదితరులు పాల్గొన్నారు.సీడ్ ఆర్గనైజేషన్ కన్వీనర్ డేవిడ్ రాజు కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...