Followers

ఉద్యమాలు ఏవైనా ప్రాణాలు ఇచ్చేది మాత్రం బీసీలే

 ఉద్యమాలు ఏవైనా  ప్రాణాలు ఇచ్చేది మాత్రం బీసీలే 

చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్ల తోనే సామాజిక న్యాయం 

బండారి బాల్ రెడ్డి ఆత్మీయ సన్మాన సభలో

 బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి  పర్ష హాన్మండ్లు

ఎల్లారెడ్డిపేట,పెన్ పవర్

ఉద్యమాలు ఏవైనా ప్రాణాలు ఇచ్చేది మాత్రం బీసీ లేనని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హాన్మండ్లు  అన్నారు.  మంగళవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని లక్ష్మీ మల్లారెడ్డి  ఫంక్షన్ హాల్ లో బీసీ సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధికార ప్రతినిధిగా ఎన్నిక కాబడ్డ బండారి బాల్ రెడ్డి ని ఎల్లారెడ్డిపేట మండల బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు . ఈ ఆత్మీయ సన్మాన సభ కు మండల శాఖ అధ్యక్షులు కంచర్ల రాజు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథి గా పర్ష హాన్మండ్లు  హాజరై  మాట్లాడుతూ బండారి బాల్ రెడ్డి ఆత్మీయ సన్మానం సభకు అన్ని బీసీ కుల సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు హాజరుకావడం బీసీల ఐక్యతకు నిదర్శనం అన్నారు. 56 శాతం జనాభా ఉన్న బీసీలు అసెంబ్లీ .పార్లమెంటులలో మాత్రం 8 శాతం మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఇది బీసీలకు జరుగుతున్న తీవ్ర అన్యాయం అన్నారు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తేనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందన్నారు . బీసీలకు మంచి చేసే పార్టీలను స్వాగతించి  మద్దతు ఇస్తామని వ్యతిరేకించే పార్టీల భరతం పడతామని ఆయన అన్నారు. ఇప్పటికైనా బీసీలు బానిస బతుకులకు స్వస్తి పలికితే భవిష్యత్తు అంతా బీసీలదే అవుతుందన్నారు. అన్ని రంగాలలో బిసి రిజర్వేషన్ 27 శాతం నుంచి 56 శాతం  కు పెంచాలని కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని బీసీలకు 20 వేల కోట్ల బీసీ సబ్ప్లాన్ ఏర్పాటు చేయాలని  హనుమాన్లు డిమాండ్ చేశారు. ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ అధ్యక్షురాలు పిల్లా రేణుక కిషన్ మాట్లాడుతూ అంచెలంచెలుగా బీసీ సంఘం లో జిల్లా అధికార ప్రతినిధిగా ఎన్నికైన వ్యక్తి బండారి బాల్ రెడ్డి అని ఆమే అన్నారు  బండారి బాల్ రెడ్డి  సమాజంలోని అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందడం గొప్ప విషయం అన్నారు . బీసీలు ఐక్యంగా అయితే సమస్యలు పరిష్కారం అవుతాయని మనం ఎవరికీ భయపడాల్సిన అవసరం కూడా ఉండదన్నారు . బిసి బిడ్డ గా నేను బిసి జాతిలో పుట్టినందుకు గర్వపడుతున్నా అన్నారు సన్మాన గ్రహీత  బండారి బాల్ రెడ్డి మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా బీసీ సంక్షేమ సంఘం లో పనిచేస్తూ బిసి ఉద్యమంలో భాగస్వామ్యం అయినందుకు ఆనందంగా ఉందన్నారు .భవిష్యత్తులో బిసి సంఘ బలోపేతానికి కృషి చేస్తూ బీసీ సమస్యల పరిష్కారానికి పాటుపడుతానన్నారు.   ఇంత పెద్ద ఎత్తున నన్ను ఆత్మీయ సన్మానం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు బండారి బాల్ రెడ్డి  ప్రకటించారు.  ఈ ఆత్మీయ సభలో బీసీ సంక్షేమ సంగం మండల అధ్యక్షులు కంచర్ల రాజు.  కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు నరసయ్య జిల్లా ఉపాధ్యక్షులు శేక్ గౌస్.  రజక సంఘం మండల అధ్యక్షులు పెద్దూరి కిష్టయ్య  ముస్లిం మైనార్టీ నాయకులు డాక్టర్ హైమద్ . తెలంగాణ మాలమహానాడు జిల్లా అధ్యక్షులు రోడ్డ రామచంద్రం బిజెపి సీనియర్ నాయకులు మద్దుల బుగ్గా రెడ్డి .దూస శ్రీనివాస్. మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షులు నంది కిషన్ . పట్టణ అధ్యక్షులు వడ్నాల  లక్ష్మణ్ . మాజీ అధ్యక్షులు మీసం రాజం. వార్డు మెంబర్లు పందిర్ల శ్రీ నివాస్ గౌడ్. గంట బాలకిషన్ గౌడ్.రవి.  కార్యదర్శి సాన రవి.  కోశాధికారి వడ్నాల ఆంజనేయులు. కొండ ఆశి రెడ్డి . మాజీ ఎంపీటీసీ ఓగ్గు బాలరాజు యాదవ్. చంద్. మేగి నర్సయ్య. లాల్ బాయి. స్కైలాప్. వడ్నాల రామస్వామి. తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...