పశువులకు రేబిస్ వ్యాధి నిరోధక టీకాలు
పెన్ పవర్,కరప
స్థానిక గ్రామపంచాయతీ పరిధిలోని పశువులన్నింటికీ రేబిస్ వ్యాధి నిరోధక టీకాలు ఉచితంగా వేస్తున్నామని, రైతులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్ధకశాఖ కరప సబ్ డివిజన్ ఏడీ డాక్టర్ ఎన్ ఎస్ సురేష్ బాబు అన్నారు. గ్రామంలో పిచ్చికుక్కలు బెడద ఎక్కువగా ఉందని రైతులు ఆందోళనచేసిన నేపధ్యంలో పశువులకు తమశాఖ, ద్వారా రేబిస్ | వ్యాధి నిరోధక టీకాలు తీసుకురావడం జరిగిందన్నారు. మండల పరిధిలోని వెటర్నరీ అసిస్టెంట్లు అందరినీ 12 టీములుగా ఏర్పాటుచేసి, రైతుల వద్దకు వెళ్లి రేబిస్ వ్యాధి నిరోధక టీకాలు వేయడం జరిగిందని ఏడీ డాక్టర్ సురేష్ బాబు తెలిపారు. రేబిస్ వ్యాధి కుక్కకాటు లేదా లాలాజల చొంగల ద్వారా వ్యాప్తి చెందుతుందని, ఈ వ్యాధి ప్రాణాంతకం కనుక రైతులందరూ తమ పశువులకు తప్పనిసరిగా యాంటీ రేబిస్ టీకాలు వేయించుకోవాలన్నారు. మొదటిరోజు 538 పశువులకు టీకా వేయడం జరిగిందన్నారు. మండల పశువైద్యాధికారి డాక్టర్ బి.శివప్రసాద్, సీహెచ్ కేవీ ప్రసాదరావు పాల్గొన్నారు.
No comments:
Post a Comment