Followers

వడదెబ్బ తగిలి రోజువారీ కూలి మృతి

 వడదెబ్బ తగిలి రోజువారీ కూలి మృతి

వేములవాడ, పెన్ పవర్

వేములవాడ నియోజకవర్గం కొనరావుపేట మండల కేంద్రానికి చెందిన సూరంపేట నారాయణ వయసు (50) చీపురు కట్టలు కడుతూ అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం రోజులాగే అడవికి వెళ్లి చీపురు పుల్లలు తీసుకొని వస్తున్న క్రమంలో వడ దెబ్బ తగిలి కుప్పకూలిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మీ ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీరిది రెక్కాడితే కానీ డొక్కాడని  నిరుపేద కుటుంబం. అండగా ఉన్న ఇంటి పెద్ద అండ కోల్పోవడం తో ఆ కుటుంబం అనాథలయ్యారు. వీరిని ప్రభుత్వం అన్ని విధాలా అదుకోవాలని సర్పంచ్ పోకల రేఖసంతోష్, ఉపసర్పంచ్ దండు శ్రీనివాస్ గ్రామ ప్రజలు కోరారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...