ప్రశాంతంగా విశ్వబ్రాహ్మణుల ఎన్నికలు
మందమర్రి, పెన్ పవర్
తెలంగాణ విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ఐక్య సంఘానికి రాష్ట్ర,జిల్లా, మండల అధ్యక్ష పదవులకు ప్రత్యక్ష ఎన్నికల విధానం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా జరుగు ఎన్నికలు శనివారం మందమర్రి పట్టణంలో ప్రశాంతంగా జరిగాయి. పట్టణంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ ప్రాంగణంలో మండల పరిధి ఎన్నికలు నిర్వహించగా, మండల పరిధిలోని 18 సంవత్సరాలు నిండిన విశ్వబ్రాహ్మణులు ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం రాష్ట్ర, జిల్లా అభ్యర్థుల ఓట్లు లెక్కింపు వివరాలను ఎన్నికల పరిశీలకులు పంపించినట్లు ఎన్నికల అధికారి చింతల రమేష్ పేర్కొన్నారు. కాగా మండల అధ్యక్ష పదవికి కస్తూరి నరసింహ చారి ఒక్కరే నామినేషన్ దాఖలు చేయగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి రమేష్ చారి ప్రకటించారు.
No comments:
Post a Comment