జికెవీధి లో ఘనంగా మహిళా దినోత్సవాలు
గూడెం కోత్తవీధి,పెన్ పవర్గూడెం కోత్తవీధి మండలం లోని జి టి డబ్ల్యూ ఆశ్రమ పాటశాల లో గిరిజన ఉద్యోగుల సంక్షేమసంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లోచెల రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మృదుభాషిని,హెచ్ డబ్ల్యూ వో నూకరత్నం లను సాలువలతో ఘనంగా సన్మానించారు.మరియు 20 మంది మహిళ ఉపాధ్యాయులను పెన్నులు ఇచ్చి ఘనంగా సన్మానించారు.ఈ సంధర్భంగా లోచెల రామకృష్ణ మాట్లాడుతూ మహిళలు అన్నీ రంగాలలో రాణించాలని,మహిళా శక్తీ ని ప్రపంచానికి చాటి చెప్పాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సి ఆర్ పి కె.రాజ్ కుమార్,ఎం ఐ సి యు. సత్యనారాయణ, ఇంద్ర,ఎస్.రామకృష్ణ,పాఠశాల సిబ్బంది,విద్యార్థునిలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment