Followers

రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో గోల్డ్ మెడల్స్ సాధించిన మండలానికి చెందిన క్రీడా కారులు

 రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో గోల్డ్ మెడల్స్ సాధించిన మండలానికి చెందిన క్రీడా కారులు

పరవాడ,పెన్ పవర్ 

విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ ఇండోర్ స్టేడియం లో నిర్వహించిన రెండవ రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్ షిప్ లో మత్స్యకార గ్రామం ముత్యాలమ్మపాలెం లో కల బ్రుస్ లి మార్షల్ ఆర్ట్స్ అకాడమీ కి చెందిన క్రీడా కారులు టోర్నమెంట్ లో అత్యుత్తమ పోరాట పటిమ తో విజేతలు గా స్వర్ణ పతకాలు సాధించి  బెస్ట్ అకాడమీ ఆఫ్ ద చాంపియన్షిప్ ని కూడా దక్కించుకుని విజేతలు గా నిలిచారు.విజేతలు అయిన క్రీడా కారులు తమ స్వగ్రామం లో గ్రామ సర్పంచ్ అయిన సుజాత ముత్యాలు ను మర్యాద పూర్వకంగా కలిసి మెడల్స్ ను చూపించి టోర్నమెంట్ వివరాలు తెలియ జేశారు.అనంతరం సుజాత ముత్యాలు మాట్లాడుతూ అకాడమీ కి చెందిన 28 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొనగా 23 బంగారు పథకాలు & 8 రజత పతకాలు &14 కాంస్య పతకాలు సాధించి  మొత్తం 45 మెడల్స్  సాధించి ముత్యాలమ్మ పాలెం పేరునే కాకుండా పరవాడ మండల ప్రతిష్టను కూడా మారు మ్రోగేలా చేశారు అని అన్నారు.

ఈసందర్భంగా సుజాత ముత్యాలు ఈ క్రీడా కారుల ఘన విజయానికి దోహద పడిన మాజీ వైస్ ఎమ్.పి.పి.పరవాడ పంచాయతీ రాజ్ ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ మరియు డైరెక్టర్ ఆఫ్ బ్రోమ చింతకాయల ముత్యాలు,చైర్మన్ ఆఫ్  బ్రోమ మైలపిల్లి అప్పన్న ధనలక్ష్మి,అకాడమీ ఫౌండర్ మరియు చీఫ్ కోచ్ సిహాన్ అరిజిల్లి అప్పలరాజు, ప్రెసిడెంట్ సోంబాబు,అకాడమీ బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందించారు.ఈ కార్యక్రమంలో అకాడమీ డైరెక్టర్ చింతకాయ మ్యుత్యాలు,చైర్మన్ మైలిపిల్లి అప్పన్న ధనలక్మి ,ఎమ్.ఎస్.కె.డి.ఏ.వి.పి  ప్రెసిడెంట్ ఎర్రబాబు,జనరల్ సెక్రెటరీ అప్పలరాజు,అకాడమీ ప్రెసిడెంట్ సోంబాబు మరియు అకాడమీ ఫౌండర్ చీఫ్ కోచ్ షిహన్ అరిజిల్లి అప్పలరాజు, సీలంభం స్పెషలిస్ట్ సోంబాబు, జాయింట్ సెక్రటరీస్ శివ, శివాజి, అకాడమీ టీమ్ మేనేజర్ శైలజ పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...