ఆనందం... రంగులమయం..!
ఘనంగా హొలీ వేడుకలు
లక్షెట్టిపెట్, పెన్ పవర్
మండలంలో హొలీ పండుగ సంబురాలు అంబరాన్నంటాయి.ఈ సందర్భంగా యువతీ యువకులు చిన్నారులు మహిళలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.యువకులు బైక్ లపై సవారీ చేస్తూ ఒకరి పై ఒకరు రంగులు చల్లుకుంటూ విధులల్లో గ్రామాల్లో తిరిగారు,ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు, తెల్లవారు జామున్నే ఆయా కూడల్లో వద్ద కముడిదహనం చేశారు.మండల వ్యాప్తంగా ఎలాంటి అపశృతులు కలగకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు.రంగుల పండగ ఈసారి రెండురోజులు కొనసాగింది హొలీ పర్వదినాన్ని మండలంలో ఒకవైపు ఆదివారం చేసుకోగా మరోవైపు సోమవారం ఘనంగా జరుపుకున్నారు, అధికారంగా కార్యాలయాలు బ్యాంకులకు సోమవారం సెలవు ప్రకటించింది,మొత్తం మీద రెండు రోజులు హోళీ సంబురాలు కొనసాగాయి.చాలా మంది కోవిడ్ నిబంధనలు పట్టించుకనట్లుగా కనిపించలేదు. కమదహనం..రంగులమయం
మండలంలో సగానికి పైగా కాలనీల్లో శనివారం రాత్రి కమదహనం నిర్వహించి. ఆదివారం హోళీ జరుపుకున్నారు. మరికొన్ని కాలనీల్లో ఆదివారం రాత్రి కమదహనం చేపట్టారు.సోమవారం రంగుల పండుగ ఘనంగా జరుపుకున్నారు.
No comments:
Post a Comment