గృహ నిర్మాణ లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ వేగవంతం చేయాలి
పెన్ పవర్, కరప
మండల పరిధిలోని గృహనిర్మాణ లబ్ధిదారుల రెండవ విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసి సకాలంలోనే పూర్తి చేయాలని ఎంపీడీవో కర్రె స్వప్న అన్నారు.స్థానిక మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం గ్రామ కార్యదర్శులు, విఆర్వోలు, సచివాలయం అసిస్టెంట్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు.గ్రామాల వారీగా సమీక్షించి నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు.హౌసింగ్ డీఈఈ కె.వి.ఆర్ గుప్తా మాట్లాడుతూ మండల పరిధిలో 3,773 మంది లబ్ధిదారులు ఉండగా ఇంతవరకు 1,673 మంది పేర్లను రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందన్నారు. మిగిలినవన్నీ రెండు రోజుల్లో పూర్తి చేయాలన్నారు.సర్వే కూడా వెంటనే పూర్తి చేయాలన్నారు.లబ్ధిదారుల జియోట్యాగింగ్ 1,303 మందికి చేశారని మిగిలిన లబ్ధిదారులు జియోట్యాగింగ్ సకాలంలో పూర్తి చేయాలన్నారు.
లేఅవుట్ల లెవలింగ్ పనులపై సమీక్ష:
మండల పరిధిలోని లేఅవుట్లలో లెవలింగ్ పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేయాలని ఎంపీడీవో కర్రె స్వప్న అన్నారు.స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఉపాధి పథకం సిబ్బంది, వివిధ శాఖల మండల స్థాయి అధికారులతో ఎంపీడీవో సమావేశమై లేఅవుట్ల లెవలింగ్ పనులను సమీక్షించి సూచనలు చేశారు.11 లేఅవుట్లలో లెవలింగ్ పనులు చేయాల్సి ఉందన్నారు. ఏయే గ్రామాల్లో లేఅవుట్ల చదును చేసే పనులు ఎంత వరకు జరిగింది, చేయాల్సిన పనుల పై చర్చించి ఆమె సూచనలు చేశారు.మండల ఇంజనీరింగ్ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, హౌసింగ్ ఏఈఈ ఎం.సోమిరెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ ప్రసాద్, మండల ఈ ఓపిఆర్డి సిహెచ్ బాలాజీ వెంకటరమణ మాచరర్రావు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment