విశ్వబ్రాహ్మణ సంఘం ఎన్నికలు...
అధ్యక్షులుగా ఎర్రోజు సతీష్ ఎన్నిక...
బెల్లంపల్లి , పెన్ పవర్బెల్లంపల్లి మండల విశ్వ బ్రాహ్మణ సంఘం ఎన్నికలు జరిగాయి.ఈ ఎన్నికల్లో 540 సభ్యులు ఓట్లు వేశారు .సాయంత్రం ఓట్ల లెక్కింపు ను చేపట్టారు.ఈ ఎన్నికల్లో ఎర్రోజు సతీష్, సజ్జనపు బ్రహ్మనందం లు ఇద్దరు అధ్యక్ష పీఠానికి పోటీలో వున్నారు.చివరికి ఈ ఎన్నికల్లో బెల్లంపల్లి మండల విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులుగా ఎర్రోజు సతీష్ 391ఓట్లతో గెలుపొందారు.సజ్జనపు బ్రహ్మనందం కు 137 ఓట్లు లభించాయి 10 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు అనంతరం వారు మాట్లాడుతూ సంఘ ఐక్యతకు, అభివృద్ధి కొరకు అహర్నిశలు పని చేస్తానని, మార్పు కోసం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియాగం చేసుకుంటానని. తన గెలుపు కోసం ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు..
No comments:
Post a Comment