Followers

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

 ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

విశాఖ ఉత్తరం, పెన్ పవర్

ఇటీవలే జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో వై సి పి అత్యధిక వార్డులలో విజయం సాధించిన సందర్భంగా ఈరోజుఉదయం విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె కె రాజు  ఆధ్వర్యంలో ఉత్తర నియోజకవర్గ కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా  కె కె రాజు మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం మరియు విశాఖ అభివృద్ధి కి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి  వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన వలనే జీవీఎంసీ ఎన్నికల్లో  వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొంది మేయర్ పీఠం దక్కిందని, అలాగే యాదవ మహిళలకు మేయర్ పీఠాన్ని ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రికి దక్కుతుందని  అన్నారు. 

ఈ సందర్భంగా యాదవ నాయకులు మాట్లాడుతూ యాదవులలో మహిళకు ఈ మేయర్ ఇవ్వటం పై మేము పూర్తిగా స్వాగతిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కార్పొరేట్ లు,మాజీ కార్పొరేట్ లు వార్డు అధ్యక్షులు, గువ్వల చంద్రశేఖర్ యాదవ్,మరియు సీనియర్ నాయకులు,కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...