అపూర్వ'కలయిక.. ఆనందహేళ
వేములవాడ, పెన్ పవర్
వారంతా 35 ఏండ్ల తర్వాత ఒక్క చోట కలిశారు... పాత జ్ఞాపకాలతో పరవశించారు...ఆత్మీయంగా పలకరించుకుని యోగ క్షేమాలు తెలుసుకున్నారు. ఎన్నేండ్లయ్యిందో కలుసుకొని అంటూ పరస్పర కరచలనాలతో ఆనందం వ్యక్తం చేశారు. వారే వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని చదివిన పదవ తరగతి విద్యార్థులు...వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1985_86 పదో తరగతి చదివిన 140 మంది విద్యార్థులు ఆదివారం వేములవాడ శివారులోని మోటూరి ఫామ్ హౌస్ లో సమ్మేళనం నిర్వహించారు.ఈ సమ్మేళనానికి పూర్వ గురువులు అన్నయ్య, విట్టల్, నారాయణ రావు ,రాజి రెడ్డి , దామోదర్ రెడ్డి లను ఆహ్వానించి... వారిని ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. విద్యార్థులు..ఉపాధ్యాయులు, విద్యార్థులు తమ ప్రసంగాలు, పాటలతో అలరించారు. చిన్నతనంలోని జ్ఞాపకాలతో ఆనందం కొమ్ము నటరాజ్ పూర్వవిద్యార్థి 35 ఏళ్ల కిందట చదువుకున్న విద్యార్థులమంతా కలుసుకోవడం ఆనందంగా ఉంది. ఈ కలయికతో చిన్నతనంలోకి వెళ్లిన అనుభూతి కలిగింది. ఉపాధ్యాయుల సలహాలు, తరగతి గదిలో జరిగిన సంఘటనలు గుర్తుకొచ్చాయి. ఇది మరిచిపోలేని అనుభూతి. మళ్లీ ఇలా కలుస్తామనుకోలేదు. పూర్వ విద్యార్ధి అబ్దుల్ ఆలీమ్ఎప్పుడో చిన్నతనంలో చదువుకున్న విద్యార్థులమంతా మళ్లీ ఇలా కలుసుకుంటాము అని అనుకోలేదు. ఇలా అందరం ఒకే చోట కలవడం ఆనందంగా ఉంది. బాల్య మిత్రులతో పాత జ్ఞాపకాలతో గడపడం అదృష్టంగా భావిస్తున్నా.
No comments:
Post a Comment