గిరిజనులను హతమార్చడమే మావోయిస్టుల సిద్ధాంతమా?
జీకేవీధిలో మావోయిస్టులకు వ్యతిరేకంగా భారీ నిరసన ర్యాలీ
గూడెం కోత్తవీధి, పెన్ పవర్
ఇంపార్మన్ల పేరుతో గిరిజనులను హతమార్చడమే మావోయిస్టుల సిద్ధాంతమా ..? మావోయిస్టులు చేసే విధ్యంసాలు,హత్యలతో ఎలాంటి ప్రయోజనం లేదని ఆదివాసీ గ్రామాల్లో అభివృద్ధి కావాలని గిరిజనులు నినదించారు.విశాఖ మన్యం లోని జీకేవీధిమండలం కొత్తపాలెంలో ఇంపార్మర్ నెపంతో మావోయిస్టులు హతమార్చిన కొర్ర పిల్కు కుటుంబీకులతో కలిసి గిరిజనులు, విద్యార్థిని,విద్యార్థులు భారీ సంఖ్యలో ఆదివారం జికేవీధిలో భారీ ర్యాలీ నిర్వహించారు.జికేవీధి మండల కేంద్రం నుంచి గూడెంకొలని వరకు మావోయిస్టు లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.మారుమూల గ్రామాలకు రోడ్లు,పాఠశాలలు, సెల్ టవర్లు,వైద్యం వంటి మౌలిక సదుపాయాల కావాలని అడిగితే ఇంపార్మర్ ముద్రవేసి గిరిజనులను మావోయిస్టులు హతమార్చుతున్నారని ఆరోపించారు. వారి హత్యలకు నిరసిస్తూ మావోయిస్టు దిష్టి బొమ్మ ను దగ్ధం చేశారు.గిరిజనుల కోసమే పనిచేస్తున్నామని చెప్పుకునే మావోయిస్టులు వారినే హతమార్చడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు.
No comments:
Post a Comment