✍గ్యాస్ , డీజిల్, పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలి
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు జుత్తు క నాగేశ్వరరావు
జగ్గంపేట, పెన్ పవర్
గ్యాస్,డీజిల్,పెట్రోల్ధరలనువెంటనే తగ్గించాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు జుత్తుక నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. జగ్గంపేట లోని గ్యాస్ ఏజెన్సీని ఆయన సందర్శించి మీడియాతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు పేరుతో ప్రతి ఒక్కరికీ గ్యాస్ కనెక్షన్ ఇచ్చి ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధరను విపరీతంగా పెంచేశారని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహార శైలికి పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగడంతో సామాన్యులపై పెను భారం పడిందన్నారు. నెలలో రెండు సార్లు రాష్ట్రంలో గ్యాస్ ధరలు పెరిగాయని, గ్యాస్ ధర నేడు కూడా పెరిగి 847రూపాయలు అమల్లోకి వచ్చిందన్నారు. రాష్ట్రంలో అనేక మంది సామాన్య ప్రజలు ఉన్నారని, ఈ గ్యాస్ ధర పెంపు తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుందన్నారు. రోజుకు 200 నుంచి 300 రూపాయల కూలీ పనిచేదుకునేవారు ఈ ధరలతో ఎలా జీవించగలరని ప్రశ్నించారు. అలాగే పప్పులు, నూనెలు, వంటి నిత్యావసర ధరలన్ని విపరీతంగా సామాన్యులు బ్రతకడానికి వీలులేకుండా పోయిందన్నారు. ఇక ఉల్లిపాయల ధరలైతే సామాన్యులను కంటతడి పెట్టిస్తున్నాయన్నారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక మంచి ప్రణాళికను తీసుకువచ్చి ప్రజలను ఈ బారి నుండి రక్షించాలని, ధరలను తగ్గించాలని నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.
No comments:
Post a Comment