Followers

జస్టిస్ రోహిణి కమిషన్ నివేదిక పై స్పందించిన ఆమ్ లోగ్ సంఘటన్ సంస్థ

 జస్టిస్ రోహిణి కమిషన్ నివేదిక పై స్పందించిన ఆమ్ లోగ్ సంఘటన్ సంస్థ

విశాఖపట్నం,పెన్ పవర్

ఓ.బి.సి. రిజర్వేషన్లు పై కేంద్ర ప్రభుత్వం  నియమించిన జస్టిస్ రోహిణి కమిషన్ సమర్పించిన నివేదికలో రిజర్వేషన్ లను 4 వర్గాలుగా విభజించి వీటిని 2,6,9,10, శాతాల్లో అమలుచేయాలని సూచించారు. కొన్ని నిమ్నజాతులైన 1674 కులాలకు 2 % రిజర్వేషన్ ను కల్పించాలన్నారు. ఈ విషయం అందరికీ తెలిసినదే. కానీ దీని వలన ఆయా జాతులకు ఎన్నో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, వాటిని పరిష్కరించే  దిశగా  రాష్ట్ర  సంచార/అర్ధ   సంచార  విముక్త   (ఎ.ఎల్.ఎస్. ) సంఘం  విజయవాడలో సమావేశం అయ్యింది. ఈ నేపధ్యం లో ఆ సంఘ నాయకుడు మరియు రాష్ట్ర రెడ్డి కుల బి.సి. వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దుక్క  లోకేశ్వర రావు విషయా విషయాలు తెలుసుకునే దిశగా  తన బృందం తో కలిసి మద్రాసు లో ఉన్న కన్నెమార నేషనల్ లైబ్రరీ లో కొన్ని గ్రంధాలను పరిశీలించి కావలసిన సమాచారా న్ని సేకరిస్తున్నామని , తదుపరి కలకత్తా లో వున్న నేషనల్ లైబ్రరీ కు కూడా వెళ్లి మరికొంత కీలక సమాచారాన్ని సేకరించే  యోచనలో ఉన్నామని , సేకరించిన విషయాలపై ఢిల్లీ వెళ్లి జస్టిస్ రోహిణి కమిషన్ తో కూలంకషంగా చర్చించి నిమ్నజాతులకు లాభం చేకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచిస్తామని తెలిపారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...