Followers

పిడి ఎస్ ఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వితంతువు నిరు పేదలకు చీరల పంపిణీ ,,,,

 పిడి ఎస్ ఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వితంతువు నిరు పేదలకు చీరల పంపిణీ ,,,,

ప్రతి ఒక్కరూ సేవా గుణం కలిగి ఉండాలి ఎమ్మార్వో సరిత రాణి 

క్రీతిక పటేల్(లెకన) పుట్టినరోజు సందర్భంగా

కేసముద్రం,పెన్ పవర్


పి డి ఎస్ ఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ బన్నీ శెట్టి విజయ వెంకటేష్ ఆధ్వర్యంలో విలేజి లోని అగాపే ఫుల్ గాస్పల్ చర్చి లో వీరి మనుమరాలు క్రీతిక పటేల్( లేఖన) పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం పేద వితంతు మహిళల కు చీరలు పిల్లలకు బట్టలు స్వీట్స్ 20 మందికి అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మార్వో సరిత రాణి హాజరయ్యారు,, స్థానిక ఎమ్మార్వో సరిత రాణి మాట్లాడుతూ పి డి ఎస్ ఎస్ స్వచ్ఛంద సంస్థల ద్వారా పుట్టిన రోజులు పెళ్లి రోజులు ఈ విధంగా జరుపు కోవడం చాలా మంచి సంకేతమని ప్రతి ఒక్కరు కూడా వీరిని ఆదర్శంగా తీసుకొని తమకు తోచినంత సహాయం పేదవారికి అందించాలని నేను కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని ప్రతి ఒక్కరు సేవ గుణం కలిగి సహయం చేయాలని వీరిని ఆ దేవుడు దీవించాలని అన్నారు ఆ సంస్థ చైర్మన్ బనిశెట్టి విజయ వెంకటేష్ మాట్లాడుతూ మాకు సంపాదనలో కొద్దిగా పేదవారికి సహాయం చేయాలని సంకల్పంతో చేస్తున్నామని ఆ దేవుని ఆశీర్వాదం మాపై ఉండాలని మీ అందరి దీవెనలు కూడా మాకు కావాలని ముందు ముందు మరిన్ని ఎక్కువగా ప్రోగ్రామ్స్ చేసే అవకాశం ఆరోగ్యం ఐశ్వర్యం కోసం దేవుని ఆశీర్వాదం మీ దీవెనలు ఎల్లప్పుడూ మాకు ఉండాలని వారన్నారు.  లయన్స్ క్లబ్ ఆఫ్ కేసముద్రం ఎక్స్ జెడ్ చిర్ర ఏకాంతం గౌడ్ మాట్లాడుతూ వీరి కుటుంబం గత కొద్ది సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలుపేదరికం లో ఉండి కూడా స్వచ్ఛంద సంస్థ ద్వారా చేస్తున్నారని ఆ దేవుని కృప వీరికి ఎల్లప్పుడూ ఉండాలని అన్నారు,, ఈ కార్యక్రమంలో లో పాస్టర్ పిల్లి కుమారస్వామి ,ఇజ్రాయిల్ ,బనిశెట్టి లోకేష్ ,అల్లం గణేష్ ,సాయి నిఖిల్, లక్ష్మీనారాయణ ,తదితరులు పాల్గొన్నారు....

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...