ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవాలి. కరోనా లేని రాష్ట్రంగా చేద్దాం..
డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి
తార్నాక, పెన్ పవర్కరోనా వైరస్ రోజు రోజుకీ విజృంభిస్తున్నందున కరోనా కట్టడికి ప్రతి ఒక్కరు విధిగా వ్యాక్సిన్ వేసుకొని మాస్కు,, శానిటైజర్ ఉపయోగించుకోవాలని, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి సూచించారు. బుధవారం తార్నాక డివిజన్ లాలాపేట్ లోని ప్రభుత్వ హాస్పిటల్ లో కరోణ వ్యాక్సినేషన్ ను పరిశీలించారు. వాక్సిన్ చేసుకోవడానికి వచ్చిన వారిని శ్రీలత శోభన్ రెడ్డి పలకరిస్తూ వ్యాక్సిన్ విషయంలో ఎటువంటి అపోహలు వద్దని ధైర్యంగా వ్యాక్సిన్ చేసుకోవాలని సూచించారు. అనంతరం ఆస్పత్రిలోని తిరిగి పరిశీలించారు. అక్కడి వైద్యులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏ సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుక రావాలని, అధికారులకు , వైద్యులకు సూచించారు.
No comments:
Post a Comment