Followers

సిసి కెమెరాలతో నేరాలు అదుపు లో ఉంటాయి

 సిసి కెమెరాలతో నేరాలు అదుపు లో ఉంటాయి...

 ఆదిలాబాద్ డి ఎస్ పి వెంకటేశ్వర్లు,

 కోగ్దూర్ గ్రామంలో సిసి కెమెరాల ఏర్పాటు


బేలా,  పెన్ పవర్

 సిసి కెమెరాలతో నేరాలు అదుపు లో ఉంటాయని ఆదిలాబాద్ డీఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం  ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని కోగ్దూర్ గ్రామంలో గ్రామస్తులు గ్రామంలోని ప్రధాన కూడలిలో  ఏర్పాటు చేసిన  సిసి కెమెరాల ఆరంభానికి ముఖ్యఅతిథిగా  ఆదిలాబాద్ డీఎస్పీ వెంకటేశ్వర్లు హాజరై సీఐ మల్లేష్, ఎస్ఐ సాయన్న లతో కలిసి సిసి కెమెరాలును ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ ప్రతి గ్రామ గ్రామాలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే ఎవరైనా తప్పు చేయ్యాలన్న భయపడతారని అన్నారు. సిసి కెమెరాలతో దొంగతనాలు అదుపులో ఉండి నేరాలు జరగకుండా కాపాడతాయని పేర్కొన్నారు. గ్రామాల్లో ఎవరైనా అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. లా అండ్ ఆర్డర్ ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. కరోనా విజృంభిస్తున్న  నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రతినిత్యం రోజువారీగా మాస్కులు ధరించి, సోషల్ డిస్టెన్స్ పాటించి, శానిటైజర్ వాడాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సుధాకర్, విజయ డెయిరీ చైర్మన్ మంగేష్ ఠాక్రే, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...